శ్రీవైష్ణవ సేవాసంఘం వికృతి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు అందరిని ఆహ్వానిస్తుంది.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేసి పంచాంగము మరియు వైష్ణవ దినచర్య ఆవిష్కరించటానికి అనుగ్రహించారు. మీరు అందరు బంధు మిత్ర సపరివారంగా పాల్గొని స్వామివారి మంగళాశాసనములను పొందగలరని ఆశిస్తున్నాము. శ్రీ వైష్ణవ బంధు మిత్రులతో కలసి పరిచయములు పెంచుకొనుటకు ఇది చక్కని అవకాశము. ముఖ్యమైన విశేషం ఏమంటే మనము ఈ ఉత్సవములను మన శ్రీ వైష్ణవ సదనము లోనే జరుపుకుంటున్నాము. ఇది ఎంతో ఆనందకరము మరియు స్ఫూర్తిదాయకము.


శ్రీ వైష్ణవ సేవా సదనం చేరుకొనుటకు క్రింది పటము లో చూపినట్టు అనుసరించండి. ఎల్ బి నగర్ రింగ్ రోడ్ నుండి చింతలకుంట బస్సు స్టాప్ వెళ్ళు దారిలో సరిగ్గా మధ్యలో చంద్రపురి కాలనీ రోడ్ నం 5 వద్ద ఎడమకు తిరగాలి. అక్కడ ఈ ఉత్సవముల కొడి (బ్యానర్) కనిపిస్తుంది, వాటిని అనుసరిస్తే సులువుగా చేరుకోవచ్చు.