Monday, February 22, 2010

SVS Trust

శ్రీమతే రామనుజాయ నమః జై శ్రీమన్నారాయణ
ప్రియ శ్రీవైష్ణవ బంధువులరా,
శ్రీవైష్ణవ సేవాసంఘం (SVS ట్రస్ట్) కీ.శే S.T.V. రఘునాథాచార్యులు గారిచే స్థాపించబడి ప్రస్తుతం 9 మంది నిర్వాహకులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుపుచున్నది. శ్రీ యాదగిరాచార్యులు గారి అధ్యక్షతన శ్రీ వేణుగోపాలాచార్యులు, శ్రీ కే.వి. రమణాచార్యులు, శ్రీ బి.ఎన్. చార్యులు, శ్రీ కే.వి.ఎన్. చార్యులు మొ. వారి ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్వహించు కార్యక్రమాల్లో కొన్ని ఇక్కడ పేర్కొనబడినవి:
౧) ప్రాధమిక విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన వారికి నగదు పురస్కారములు మరియు పేద విద్యార్ధులకు సహాయక పురస్కారములు అందించుట
౨) వేద అధ్యయన మరియు యాగ్నిక అధ్యయన విద్యార్ధులకు ఆర్ధిక సహకారం అందించుట
౩) శ్రీ వైష్ణవ వైద్యుల తో ఉచిత వైద్య శిబిరములునిర్వహించుట
౪) ఉగాది ఉత్సవము, కవి సమ్మేళనము
౫) పండిత సత్కారములు
౬) వనభోజనములు
శ్రీవైష్ణవ సేవాసంఘం పేద విద్యార్ధులకు వసతి, గ్రంధాలయం, సభామంటపం, మరియు వృద్ధులకు వసతి వంటి ఇతర సదుపాయముల కోసము ఒక భవన నిర్మాణము తలపెట్టినది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారిచే శంకుస్థాపన కావించబడిన ఈ భవనము ప్రస్తుతం cellar+ 2 floors slabs మాత్రమే పూర్తి చేసుకున్నది. ఈ మహత్కార్యానికి సహృదయంతో విరాళం ఇచ్చిన దాతలందరికి శ్రీవైష్ణవ బంధువులు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నారు. భవనం పూర్తి కావటానికి ఇంకా ప్రతి floor లో గదుల నిర్మాణం మరియు furtniture మొ.వి సమకూర్చుకోవలసి వున్నది. ఈ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి శ్రీవైష్ణవ బంధువులకి మరిన్ని సేవలు అందించేలా సహకరించవలసిన బాధ్యత మన అందరి మీదా వుంది.
మరిన్ని వివరాలు పొందుపరచబడిన శ్రీవైష్ణవ సేవాసంఘం కరపత్రం scan చేసి ఇక్కడ వుంచినాము (చిత్రము స్పష్టంగా చూచుటకు చిత్రం పై click చెయ్యండి), మీ అమూల్యమైన కాలాన్ని కొద్దిగా వెచ్చించి దీనిని చదువగలరు. అన్నివిధాలా మీ సహకారాన్ని అందించి సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకోగలరు.
శ్రీ వైష్ణవ సేవసంఘానికి మీరు ఇచ్చు విరాళములకు income tax act 80G క్రింద ఆదాయ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రవాస భారతీయులు ఇచ్చు విరాళములకు వారి తల్లిదండ్రుల పేర లేదా వారు సూచించిన వారి పేర 80G certificate ఇవ్వబడును.
శ్రీవైష్ణవ బంధువులు, విశిష్టాద్వైత అనుయాయులు, శిష్యులు సహృదయం తో ఈ సత్కార్యానికి సహకరించగలరు.
cheque లేదా DD 'SVS trust, hyderabad' పేర ఇవ్వవచ్చును మీ పూర్తి వివరములు పొందుపరచ గలరు.
Online transfer చెయ్య తలచిన వారు కింద పేర్కొన్న account number కి transfer చెయ్యగలరు. దీనిని సరిచూచుకొనుటకు 040-66625502 నెంబర్ కు ఫోన్ చేయగలరు.
acc no: 1 1 7 9 1 0 1 0 2 3 5 6 3, CANARA BANK, Dilsukhnagar, Hyderabad.

విరోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవముల ఆహ్వాన పత్రము ఇక్కడ వుంచినాము. ఇందులో శ్రీవైష్ణవ సదనం చిత్రము కూడా వున్నది గమనించగలరు.

No comments:

Post a Comment